BREAKING
సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు| యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ

కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు

Select Suryaa Now
కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు

కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు

ప్రధాన కార్యదర్శిగా కొట్టారు రామారావు, ఉపాధ్యక్షుడిగా పచ్చిపాల నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ , అక్టోబర్ 24: కృష్ణ స్విమర్స్ నూతన పాలక కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా  పిన్నెల్లి పాండురంగారావు, ప్రధాన కార్యదర్శిగా కొట్టారు రామారావు, ఉపాధ్యక్షుడిగా  పచ్చిపాల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులుగా శివయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు.

కృష్ణ స్విమర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు  మోటపోతుల కిషోర్ బాబు నూతన పాలక కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్విమ్మింగ్ క్రీడ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహా మండలి సభ్యులు కొల్లి మార్షల్ స్టాలిన్, గోగుశెట్టి వెంకట మహేష్, తుళ్లూరి తిరుమలరావు, పూర్వ అధ్యక్షులు చెరుకూరి రమేష్, జగ్గయ్యపేట స్విమ్మింగ్ కోచ్ పొట్టబత్తిన పాండురంగారావు, కోచ్ లక్ష్మీ దంపతులతో పాటు పలువురు పాల్గొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. రానున్న రోజుల్లో స్విమ్మింగ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, అసోసియేషన్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

 

 

రిపోర్టర్ :శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా