ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు
హత్నూర; సంగారెడ్డి జిల్లా హత్నూర మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం హత్నూర పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీధర్ రెడ్డిని నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ నెల 22వ తేదీన మండలంలో నిర్వహించిన 'పండుగ సాయన్న జయంతి వేడుకలు' ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందించిందని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. పోలీసుల సేవలకు గుర్తింపుగానే ఎస్సై శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు తలారి రాజేందర్ ముదిరాజ్, కాసాలా సర్పంచ్ కొట్టంల వెంకటేష్, లింగాపూర్ సర్పంచ్ చార్ల మణిదీప్ దుర్గయ్య తలారి యాదగిరి పాటు సంఘం కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు