రిమ్స్ లో గర్భిణీ మృతి.. కడుపులో కవలలు సైతం మృతి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఏడు నెలల గర్భిణీ బి. సునీత మృతి చెందడం కలకలం రేపింది.బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్ల వాపులతో ఈ నెల 21న సునీత రిమ్స్ లో చేరింది. చికిత్స పొందుతుండగా బీపీ అకస్మాత్తుగా పెరగడంతో ఆమె మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న కవల శిశువులు కూడా మృతి చెందారు.ఒకేసారి తల్లితో పాటు ఇద్దరు శిశువులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.