డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి
ముదిరాజ్‌లకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదు: నీరుడు శేఖర్ ముదిరాజ్
గండిపేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 24) : కామారెడ్డి డిక్లరేషన్‌లో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు నీరుడు శేఖర్ ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనలు చేయడమే కాకుండా, వాటిని ఆచరణలో చూపించాలని కోరారు.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పండగ సాయన్న జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అయితే గతంలో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని, తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే హైదరాబాద్‌లో పండగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ముదిరాజ్‌ల ఓట్లు కోరుతూ వారి హక్కులను విస్మరించడం సమంజసం కాదని పేర్కొంటూ, హామీలను అమలు చేయకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.