BREAKING
కాలువలో కాలుజారి వ్యక్తి మృతి పెగరగుంట ఎంపీటీసీ అభ్యర్థిగా భువనేశ్వరి జగదీష్ నాయుడు నామినేషన్ ఏ ఐ టి యు సి కృషితో పెనాల్టీని రద్దు చేసిన సింగరేణి యాజమాన్యం దాడిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శ... హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ: అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీపై సెబీ కొరడా: రూ. 11.5 కోట్ల జరిమానా విధింపు.. బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం

ఏ ఐ టి యు సి కృషితో పెనాల్టీని రద్దు చేసిన సింగరేణి యాజమాన్యం

Select Suryaa Now
ఏ ఐ టి యు సి కృషితో పెనాల్టీని రద్దు చేసిన సింగరేణి యాజమాన్యం

కొత్తగూడెం సింగరేణి, సూర్య ; దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. దీని కారణంగా కాంట్రాక్టర్లకు పెనాల్టీలు విధించగా, అనేక ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్ట్ కార్మికుల వద్ద నుండి రికవరీ చేసుకున్నారు.దీనిపై గత 7, 8 నెలలుగా ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కే రాజకుమార్ సహకారంతో సింగరేణి సీఅండ్ఎండి మరియు డైరెక్టర్ పర్సనల్ తదితర ఉన్నత అధికారులకు అనేక సార్లు విన్నవించుకున్న ఫలితంగా, ఏఐటీయూసీ చేసిన పోరాటం ఫలితంగా సింగరేణి యాజమాన్యం పెనాల్టీలను రద్దు చేస్తూ సర్క్యులర్ విడుదల చేసిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాపర్ తెలిపారు.శుక్రవారం కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ హాస్పిటల్ ఏరియా సివిక్ పని ప్రదేశంలో యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్‌ను యూనియన్ నాయకులు కార్మికుల సమక్షంలో ప్రదర్శించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌ల మూలంగా కార్మిక హక్కులను లేకుండా చేయడం, పోరాటాలను నియంత్రించే దానిలో భాగంగా సింగరేణి యాజమాన్యం కూడా భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలు, ఉద్యమాలలో పాల్గొనకుండా ఉండాలనే ఉద్దేశంతో పెనాల్టీలు విధించిందని విమర్శించారు. చట్టబద్ధంగా జరిగిన సమ్మెలకు పెనాల్టీలను అనేక సంవత్సరాలుగా రద్దు చేస్తూ వస్తున్నప్పటికీ ఈసారి ప్రత్యేకంగా యాజమాన్యం మొండిగా వ్యవహరించిందని అన్నారు.పెనాల్టీ రద్దు సర్క్యులర్ రావడం ఆలస్యమైన నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అనేకమంది కాంట్రాక్టర్లు వర్కర్స్ వద్ద నుండి డబ్బులు వసూలు చేశారని, ప్రస్తుతం పెనాల్టీ రద్దు చేస్తూ సర్క్యులర్ వచ్చిన నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన వేతనాలను తక్షణమే చెల్లించాలని, రికవరీ చేసిన డబ్బులను తిరిగి కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ సమస్యపై కూడా ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అప్పారావు, బాలాజీ, సంజీవరావు, మహేందర్, లక్ష్మి, రమణ, ప్రసాదు, కృష్ణవేణి, నాగరాజు, రామకృష్ణ, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.