జగ్గయ్యపేట పట్టణాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
జగ్గయ్యపేట పట్టణాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
జగ్గయ్యపేట పట్టణాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పట్టణ ప్రజలకు వివరించారు.
జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 10వ వార్డులో నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజాగోపాల్ (చిన్న) పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆదిమళ్ళ అబ్రహం తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
వైఎస్ఆర్ సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే మా బలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను నాయకులు వివరించారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
జగ్గయ్యపేట పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగాలన్నా, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించండి
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి షేక్ హఫీజున్నిసా ని , 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆదిమళ్ల అబ్రహం ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తన్నీరు నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జగ్గయ్యపేట పట్టణ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, పట్టణాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా