దేవరగట్టులో ఇనుప గొలుసులు తెంపిన గొరవయ్య.
దేవరగట్టులో ఇనుప గొలుసులు తెంపిన గొరవయ్య..
హొళగుంద,సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఉత్సవాల భాగంగా శనివారం ఉదయం హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గొరవయ్య గాదిలింగ మూడు జటికలకు ఇనుప గొలుసును తెంచాడు.గట్టు కింద ఉన్న సింహాసన కట్టకు కట్టిన ఇనుప గొలుసును తెంచి భక్తులను ఆశ్చర్యానికి గురి చేశాడు.ఆదేవిధంగా గొరవయ్యల నృత్య ప్రదర్శనలు,సాంస్కృతిక కార్యక్రమాలు,కోలాటాలు, కంకణ విసర్జన, వసంతోత్సవం,స్వామివార్ల విగ్రహం మూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు విశేషంగా జరిగాయి.గొరవయ్య నృత్య ప్రదర్శనలు తిలకించడానికి ఆంధ్ర నుండి కాకుండా తెలంగాణ,కర్ణాటక ప్రాంతాల నుండి ఆశేష భక్తజనం హాజరయ్యారు. దేవరగట్టులో భక్తజన సందోహంతో గట్టు కిక్కరించింది.జాతర మహోత్సవం కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి.