ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం
అనంతపురంబ్యూరో,(అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్) : నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మైదానానికి వచ్చిన ప్రజలు, పాదచారులను కలిసి వైసీపీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రచారంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. గత రెండున్నరేళ్ల కూటమి పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతపురం నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించేలా పాలన అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.