BREAKING
రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు.. గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి.. పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు పోలీసులకు వ్యాసరచన పోటీలు 1,380 మంది బైండోవర్‌ కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్.. తొలి రోజు ఆటలో పూర్తి పట్టు సాధించిన న్యూజిలాండ్ ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి నిర్మాణం ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్రలో అదరగొడుతున్న ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా సౌరవ్ గంగూలీ స్ఫూర్తితో ‘దూస్రా’ సినిమా.. ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్

61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం..

Select Suryaa Now
61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు..  ఇంటింటా ఓట్ల అభ్యర్థన..   భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం..

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 61వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దొండ్లవాగు జయమ్మ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ జనసందోహం మధ్య సాగుతున్న ప్రచారంతో డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది.ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుంటూ తనకు ఓటు వేసి గెలిపించాలని జయమ్మ అభ్యర్థిస్తున్నారు. స్థానిక అభ్యర్థిగా తనను ఆదరిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, తమ అమూల్యమైన ఓటును తనకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.జయమ్మ ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రచార హోరు మరింత పెరిగింది. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు శ్రమిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో దొండ్లవాగు మోహన్, మాజీ కార్పొరేటర్ నాగమణి, సీనియర్ నాయకులు గుర్రప్ప, నంద, డివిజన్ అధ్యక్షుడు కృష్ణ, జావిద్, ఎర్రిస్వామి, కవిత, పద్మ, పద్మజ, మళ్లీ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, మహిళా కార్యకర్తలు జయమ్మకు మద్దతుగా ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు.