BREAKING
మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం

సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా:

Select Suryaa Now
సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా:

సూర్య కరీంనగర్ ప్రతినిధి:సైబర్ మోసాలకు వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై (Mule Accounts) పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న సైబర్ క్రైమ్ కేసులకు (UI cases) సంబంధించి నమోదైన వివరాలను సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.

జిల్లాలోని మొత్తం 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, వీటిలో మొత్తం 122 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 89 మందికి సంబంధించి అరెస్ట్‌లు లేదా చట్టపరమైన నోటీసులు జారీ చేయడం పూర్తి కాగా, మిగిలిన 33 మంది నిందితుల అరెస్ట్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని సీపీ తెలిపారు.

పోలీస్ స్టేషన్ల వారీగా వివరాలు:
* కరీంనగర్ 1 టౌన్: 6 కేసులు, 20 మంది నిందితులు (13 మందిపై చర్యలు, 7 పెండింగ్)
* కరీంనగర్ 2 టౌన్: 5 కేసులు, 26 మంది నిందితులు (16 మందిపై చర్యలు, 10 పెండింగ్)
* కరీంనగర్ 3 టౌన్: 2 కేసులు, 12 మంది నిందితులు (10 మందిపై చర్యలు, 2 పెండింగ్)
* కరీంనగర్ రూరల్: 1 కేసు, 06 నిందితులు, 01 పై చర్యలు, 05నిందితులు అరెస్ట్ పెండింగ్
* జమ్మికుంట టౌన్: 3 కేసులు, 15 మంది నిందితులు (11 మందిపై చర్యలు, 4 పెండింగ్)
* హుజూరాబాద్ టౌన్: 2 కేసులు, 10 మంది నిందితులు (9 మందిపై చర్యలు, 1 పెండింగ్)
* కొత్తపల్లి: 2 కేసులు, 5 గురు నిందితులు (అందరిపై చర్యలు పూర్తి)
* మానకొండూరు: 2 కేసులు, 3 గురు నిందితులు (1 చర్యలు పూర్తి, 2 పెండింగ్)
* చొప్పదండి: 1 కేసు, 5 గురు నిందితులు (అందరిపై చర్యలు పూర్తి)
* ఇల్లందకుంట: 1 కేసు, 5 గురు నిందితులు (అందరిపై చర్యలు పూర్తి)
* గంగాధర: 1 కేసు, 6 గురు నిందితులు (అందరిపై చర్యలు పూర్తి)
* ఎల్.ఎం.డి. కాలనీ: 1 కేసు, 7 గురు నిందితులు (6 గురిపై చర్యలు, 1 పెండింగ్)
* సైదాపూర్: 1 కేసు, 1 నిందితుడు (చర్యలు పూర్తి)
* వీణవంక: 1 కేసు, 1 నిందితుడు (అరెస్ట్ పెండింగ్)
* కేశవపట్నం & రామడుగు: ఎటువంటి కేసులు నమోదు కాలేదు.

పోలీసుల హెచ్చరిక:
తమ బ్యాంక్ ఖాతాలను, ఏటీఎం కార్డులను, లేదా ఓటీపీలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం గానీ, కమీషన్ల ఆశ చూపి చేసే లావాదేవీలకు వినియోగించడానికి ఇవ్వడం గానీ నేరమని పోలీసులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరించే ఖాతాదారులను కూడా చట్టపరంగా నేరంలో భాగస్వాములుగానే పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.