వర్తక సంఘం నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణం శ్రీ శిరిడి సాయి పట్టణ వర్తక సంగం నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారం శుక్రవారం రాత్రి జరిగినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కడియాల మోహన్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం అనంతరం ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం నాయకులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.