BREAKING
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు - కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఎస్సీ ఎస్టీ ల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి * బాబు, జగన్ ఇద్దరూ ఒక్కటే * జనాభా గణన ఫేజ్-2 సమస్యలను పరిష్కరించాలి : పిఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల శాఖ సంగారెడ్డి జిల్లాలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు ఈనెల 25 నుండి శిక్షణ శిబిరాలు ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి తూముల సప్తధాన్య కషాయంపై అవగాహన బొబ్బిలిలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం 31వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న మందపాటి భానుప్రియ ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం వయో వృద్ధుల దినోత్సవ వేడుకల సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం

నీటి వనరుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. --పాలడుగులో అధికారుల తనిఖీలు అక్రమ నీటి కనెక్షన్లు తొలగించాల్సిందే.. లేకుంటే చర్యలు తప్పవు!

Select Suryaa Now
నీటి వనరుల దుర్వినియోగంపై ఉక్కుపాదం..  --పాలడుగులో అధికారుల తనిఖీలు  అక్రమ నీటి కనెక్షన్లు తొలగించాల్సిందే.. లేకుంటే చర్యలు తప్పవు!

నీటి వనరుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. --పాలడుగులో అధికారుల తనిఖీలు అక్రమ నీటి కనెక్షన్లు తొలగించాల్సిందే.. లేకుంటే చర్యలు తప్పవు!: తెలంగాణ (ఖమ్మం జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. --నీటి వనరుల దుర్వినియోగంపై ఉక్కుపాదం..--పాలడుగులో అధికారుల తనిఖీలుఅక్రమ నీటి కనెక్షన్లు తొలగించాల్సిందే.. లేకుంటే చర్యలు తప్పవు!వైరా రూరల్ (సూర్య న్యూస్):-తాగునీటి వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలో పంచాయతీ బోర్‌కు ఉన్న అక్రమ నీటి కనెక్షన్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1916కు గ్రామానికి చెందిన గుండెపోగు వేణు చేసిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి వనరులను తనిఖీ చేశారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ కృష్ణ చైతన్య, ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ ఏఈ వసంత్‌ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.గ్రామంలోని పంచాయతీ బోర్‌ను పరిశీలించిన అధికారులు దానికి ఉన్న అక్రమ కనెక్షన్లపై ఆరా తీశారు. ప్రజల అవసరాల కోసం ఉద్దేశించిన నీటి వనరులను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ కనెక్షన్లను తక్షణమే తొలగించాలని, ఆదేశాలను పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం గ్రామంలోని బావులను పరిశీలించిన అధికారులు వాటిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌ వేయాలని సూచించారు. బావుల నీటిని దుస్తులు ఉతకడం, ఇంటి పనిముట్లను శుభ్రం చేసుకోవడం వంటి అవసరాలకే వినియోగించాలని, తాగునీటిగా ఉపయోగించరాదని స్పష్టం చేశారు.

మొత్తంమీద ఈ పరిణామం తెలంగాణ (ఖమ్మం జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.