ఎస్సీ ఎస్టీ ల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి * బాబు, జగన్ ఇద్దరూ ఒక్కటే *
సీతమ్మధార, సూర్య : ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలు పునరుద్ధరించని మాట తప్పిన టీడీపీ కూటమిని, పథకాలు రద్దు చేసిన వైసీపీ లను స్థానిక ఎన్నికల్లో ఓడించాలని నీలి పార్టీలు ఇండియా కూటమి ను గెలిపించాలని విదసo ( విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బూసి వెంకట రావు పిలుపునిచ్చారు. విశాఖ అంబేద్కర్ భవన్ లో జరిగిన పత్రికా సమావేశంలో వెంకట రావు మాట్లాడుతూ టీడీపీ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు జరపకుండా స్థానిక ఎన్నికల్లో ఓటగే నైతిక హక్కు లేదన్నారు. జగన్ హయాంలో రద్దయిన పథకాలు పునరుద్ధరిస్తాం అని, 50 ఏళ్లకే పింఛను ఇస్తాం అని, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలవారి 15 వందలు వీటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. 2019 కి ముందు ఉన్న పథకాలను రద్దు చేసిన వైసీపీ దళితులకు చేసిన అన్యాయం ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
చంద్రబాబు బాబు కూడా ఎస్సీల జీవనోపాధికి గండి కొట్టడానికి 1977 ప్రోహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అసైన్డ్ చట్టం లో మార్పులు చేశారని గుర్తు చేశారు. గత బడ్జెట్ సమావేశాల్లో అసైన్డ్ భూములు లీజు నిషేధాన్ని తొలగించి 1977 అసైన్డ్ భూ బదిలీ నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. ఈ సవరణ ప్రకారం దళితుల జీవనాధారంగా ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసేసుకుని సోలార్, విండ్ పవర్ , పంప్ డు స్టోరేజీ విద్యుదుత్పత్తి అంటూ గ్రామాల్లో వేల మంది దళితులకు ఆసరాగా ఉన్న లక్షల ఎకరాల అసైన్డ్ భూములు సమీకరించి నామ మాత్రపు లీజుకు అదానీ, అంబానీలకు కట్టబెట్టే పథకాన్ని రూపొందించుకున్నారు. ఇది దళిత సంక్షేమమా లేక దళితుడు చేతిలో ఉన్న ఎకరా , అరెకరా భూమి లాక్కోవడమా అని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు గత పదేళ్లుగా సగం కూడా ఖర్చు చేయలేదని కాగ్ గుర్తించిందని విమర్శించారు. గ్రామాల్లో, పట్టణాల్లో దళిత వాడల అభివృద్ధి కి ఎన్ని నిధులు వచ్చించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మురికి వాడల్లో మౌలిక సదుపాయాలకు స్థానిక సంస్థల కు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీలు ప్లాంటు అమ్మకం, విశాఖ ఎయిర్ పోర్టు ఎత్తివేయడం, తమ పార్టీ ఎంపీకి 2500 కోట్లు విలువైన 54 ఎకరాల భూమి కట్టబెట్టడం , తర్లపాలెం అసైన్డ్ భూములు డేటా సెంటర్ కు ఇవ్వడం ఇవన్నీ అదానీ, జీ ఏం ఆర్, గీతంల అభివృద్ధికే తప్ప దీంట్లో ప్రజల అభివృద్ధి లేశమాత్రం లేదని దుయ్యబట్టారు. దళితులకు దగా చేసిన పాలక పార్టీగా కూటమిని ప్రకటిస్తూ వైసీపీ, టీడీపీ కూటమి ఆధిపత్య కుల రాజకీయ పార్టీలను ఓడించాలని,. సైద్ధాంతిక పరంగా అంబేద్కర్ భావజాల ఎజెండాతోను , అభ్యుదయ లౌకిక ఎజెండా తో పోటీచేసే బీఎస్పీ, నీలి పార్టీలు ఇండియా బ్లాక్ పార్టీల అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు.జాజి ఓంకార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోదదాసీ సుధాకర్. శ్రీకాకుళం , విజయ నగరం, విశాఖ , అనకాపల్లి జిల్లాల నాయకులు యెడ్ల గోపి, బొమ్మాళి సుందర రావు, వి రాజు, గోడి వెంకటేశ్వర రావు, చెక్క రాంబాబు , గుడివాడ ప్రసాద్, మూర మహేశ్, గుడివాడ భాస్కర, గురు దేవి పావడ సన్యాసిరావు, తాటిక రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.