చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...!
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్ .రామాంజనేయులు నాయక్ హెచ్చరించారు.
శనివారం నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సాధు రవికుమార్ ఆదేశాల మేరకు, నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. రామాంజనేయులు ఆధ్వర్యంలో మిడ్తూరు మండలంలోని తలముడిపి గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న (బెల్ట్ షాపులు) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈడిగ రాజు గౌడ్ (50) అనే వ్యక్తి నుండి 9 మద్యం బాటిళ్లు మరియు రాజశేఖర్ (45) అనే వ్యక్తి వద్ద 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక ఎన్నికల నిబంధనలు మరియు శాంతిభద్రతల దృష్ట్యా పాత నేరస్థులైన 7 మంది వ్యక్తులను (వివిధ గ్రామాలు/మండలాలకు చెందిన వి. బాల వెంకటయ్య, వి. నడిపి అయ్యన్న, కోటేశ్వరరావు, యు. సుబ్బరాయుడు, ఈ. రామకృష్ణ గౌడ్, ఈ. పుల్లయ్య గౌడ్, ఎల్. రాజశేఖర్ గౌడ్) తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందన్నారు.
ఈ తనిఖీలలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు భాష్యం శ్రీనివాసులు, హరిత మరియు సిబ్బంది శేఖరయ్య నాయకుడు, పద్మనాభం, జనార్దన్, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.