BREAKING
కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం..

వైద్య పరమైన రికార్డులను జాగ్రత్తగా భద్రపర్చాలి- జిల్లా జడ్జి

Select Suryaa Now
వైద్య పరమైన రికార్డులను జాగ్రత్తగా భద్రపర్చాలి-   జిల్లా జడ్జి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారు వైద్యపరమైన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా భద్రపర్చాలని జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు, వైద్య రంగ నిపుణులకు వివిధ అంశాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలే తదితరులు పాల్గొన్నారు. వైద్యుల హక్కులు, వైద్య సేవల్లో చట్టపరమైన బాధ్యతలపై జిల్లా జడ్జి, కలెక్టర్, ఇతర వక్తలు ముఖ్య సూచనలు చేశారు. హెల్త్‌ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్) చట్టం–2025, వైద్య రికార్డుల నిర్వహణ, వాటి చట్టపరమైన ప్రాముఖ్యత, న్యాయపరమైన విచారణల్లో వాటి ప్రామాణికత తదితర అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. వైద్య సేవలందించే సమయంలో చట్టపరమైన నిబంధనలను పాటించడం, వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా వైద్యులు, రోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయ ప్రక్రియకు సహకారం అందించిన వారు అవుతారని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. న్యాయవ్యవస్థలో వైద్యులు భాగస్వాములుగా వ్యవహరించాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.నారాయణ, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని, ట్రైనీ కలెక్టర్ సురేష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.సుభాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎ.విశాల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రాష్ట్ర వైద్య మండలి జిల్లా ఇన్‌చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రాథోడ్, రాజ్ కుమార్ సుబేదార్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.