BREAKING
నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి పీఎం రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం విఫలం నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన నాగండ్ల వైసీపీ నాయకులు నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్ వైట్‌హౌస్ ప్రెస్ బ్యూరో, డోనాల్డ్ ట్రంప్, అమెరికా మీడియా, వెస్ట్ వింగ్, జేమ్స్ బ్రాడీ ప్రెస్ రూమ్

*పరిపాలన చేతకాక రైతుల పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం*

Select Suryaa Now
*పరిపాలన చేతకాక రైతుల పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం*

నారాయణఖేడ్;నల్లవాగు ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ నీటిని చివరి ఆయకట్టు వరకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు విఫలమవుతున్నారు ప్రాజెక్టులోని నీరు అలుగు ద్వారా వాగులోకి వృథాగా పోతుంటే, మరోవైపు అదే నీటి కోసం రైతులు తమ పంట పొలాలు ఎండిపోతూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుస్థితికి బాధ్యులెవరు కాలువలకు కనీస మరమ్మతులు చేపట్టకుండా, నీటిని సక్రమంగా వినియోగించుకునే ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ, బీబీపేటలోని రామేశ్వరం చెరువులోకి నీటిని విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా నీటి నిర్వహణలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల రైతుల కష్టార్జితం కళ్లముందే ఎండిపోతుంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు రైతుల చెమటకు విలువ లేదా వారి పంటలకు నీరు అందించడం మీ బాధ్యత కాదా రైతులు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి, కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతుంటే వారి బాధ వర్ణనాతీతం. ఒకవైపు నీరు వృథాగా ప్రవహిస్తుంటే, మరోవైపు నీరు అందక పంటలు ఎండిపోవడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం కాదా రైతుల సమస్యలను పట్టించుకోకుండా, వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం ఎంతవరకు సమంజసం  కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి సూటి ప్రశ్నలు నల్లవాగులో పూర్తిస్థాయిలో నీటిమట్టం  ఉన్న నీటిని చివరి ఆయకట్టు వరకు ఎందుకు అందించలేకపోతున్నారు?కాలువలకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మరమ్మతులు ఎందుకు చేపట్టలేదు నీరు వృథాగా పోతుంటే దాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలేమిటి పంటలు ఎండిపోతున్న రైతులకు తక్షణమే సాగునీరు అందించే కార్యాచరణ ఏది మా డిమాండ్ ఒక్కటే రైతులకు తక్షణమే సాగునీరు అందించాలి నల్లవాగు నీటిని సక్రమంగా వినియోగించి, కాలువలకు అత్యవసర మరమ్మతులు చేపట్టి, చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులకు న్యాయం చేయాలి. రైతుల సమస్యలపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి స్పష్టమైన సమాధానం చెప్పాలి. నీరు ఉన్నా పంటలు ఎండిపోవడం రైతుల తప్పు కాదు.. అది పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు