అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర
మర్రిపాడు మేజర్ న్యూస్: మర్రిపాడు మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానంలో కూడా కూటమి అభ్యర్థుల అఖండ విజయం తద్ద్యమని అన్నవరం దేవస్థాన డైరెక్టర్ మర్రిపాడు మండల బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బిజవేముల సురేంద్రనాథ్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే అభ్యర్థుల గెలుపునకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. దీంతోపాటుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులు కూడా అభ్యర్థుల గెలుపుకు శ్రీకారం చుడుతాయన్నారు. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించి ఎంపీపీగా పుట్టం విజయనిర్మలారెడ్డి, జడ్పీటీసీగా గంగినేని ప్రసన్నలు బాధ్యతలు చేపట్టడం ఖాయమని తెలియజేశారు.