BREAKING
ఎస్సి అభివృద్ధి శాఖ కమీషనర్ ను కలిసిన పియు వీసీ శ్రీనగర్ వేదికగా మూడో విడత కాశ్మీర్ మారథాన్ భట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ నామినేషన్ లు 61 చెల్లుబాటు అయ్యాయి వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం: గడువు కంటే 5 నెలల ముందే 11 కోట్ల 'రైతు ఐడీల' లక్ష్యం పూర్తి.. కేంద్ర వ్యవసాయ శాఖ చారిత్రక మైలురాయి! 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత వేములపల్లికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్

ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్

Select Suryaa Now
ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్

నెల్లూరు కలెక్టరేట్,  మేజర్ న్యూస్  :   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ నిరంతరం సేవలందిస్తోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు సుమారు 50 మంది ప్రజలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. ప్రజల సందేహాలకు సిబ్బంది సమాధానాలు అందించడంతో పాటు, సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  కాల్ సెంటర్‌లో మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ప్రతి షిఫ్టులో ఎనిమిది మంది చొప్పున మొత్తం 24 మంది సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవసరమైన సమాచారం అందించడం, సందేహాలను నివృత్తి చేయడం, సమస్యల పరిష్కారానికి సమన్వయం చేయడం కాల్ సెంటర్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.  ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే ప్రజలు 0861-2331261 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని, 7995576699 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సంప్రదించి సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు.