యూట్యూబ్ ఛానల్ పై సర్పంచ్ ఫిర్యాదు.....
మద్దూర్..…సర్పంచ్ పై అసభ్యకరమైన రీతిలో దూషించిన యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని మద్దూర్ మండలంలోని నర్సాయపల్లి గ్రామ సర్పంచ్ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు శనిగారం సత్యనారాయణ బిఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం మద్దూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై మహమ్మద్ ఆసిఫ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో ఎన్నుకోబడిన తనను దూషించి మనోభావాలను దెబ్బతీసినట్లు తను ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మేక సంతోష్ కుమార్, బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు మలిపెద్ది మల్లేశం, మద్దూర్ ఉప సర్పంచ్ షకీల్ అహ్మద్, వంగపల్లి సర్పంచ్ రామస్వామి, గాగిలాపూర్ ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు, పార్టీ నాయకులు కాసర్ల కనకరాజు, నల్ల బాల్ రెడ్డి, గడిపే అనిల్ కుమార్, జక్కుల రమేష్, శనిగరం మల్లేశం, కనకయ్య ముస్త్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.