యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు
పలాస, సూర్య : శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీలలో పలాస మండలం, రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి విద్యా విహార్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలు
ఎం.జస్వంత్,పి.యదువంశీ, ఇ.చరణ్, ఆర్.వశీకర్, జి.భవ్యక్ రెడ్డి, డి.ఎల్. కశ్యప్, కె.చిరంజీవి.వీరికి కోచ్ గా కిరణ్ రెడ్డి వ్యవహరించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయంపై ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ : విశ్వేశ్వర, పలాస, శ్రీకాకుళం జిల్లా.