BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు - అప్రమత్తంగా ఉండాలన్న బి. బ్రహ్మ రెడ్డి

Select Suryaa Now
బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు - అప్రమత్తంగా ఉండాలన్న బి. బ్రహ్మ రెడ్డి

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఈనెల 26 నాటికి తుఫాన్ గా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని భట్టిప్రోలు మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్నందున ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టిందన్నారు. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారనిఆయన పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారిక సూచనలు పాటించాలని సూచించారు.రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-కోతకు సిద్ధంగా ఉన్న వరి, ధాన్యం, పత్తి వంటి పంటలను తడవకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలి
-పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా ముందుగానే పారుదల కాలువలు సిద్ధం చేసుకోవాలి
-పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి
-బహిరంగంగా నిల్వ చేసిన ఎరువులు, విత్తనాలను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తుఫాన్ ఏర్పడటం, దాని తీవ్రత, తీరం దాటే ప్రదేశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ప్రజలు భారత వాతావరణ శాఖ (ఐ ఎం డి), రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే తాజా అధికారిక బులెటిన్లను మాత్రమే అనుసరించాలని ఏవో బ్రహ్మారెడ్డి కోరారు.