రెండు నామినేషన్లు తిరస్కరణ.
వైకాపా ,కాంగ్రెస్ చేరొక నామినేషన్లు తిరస్కరణ.
సూర్య న్యూస్ దర్శి. దర్శి మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దానికి సంబంధించి గత మూడు రోజులు నామినేషన్ ప్రక్రియ జరిగింది. 17 స్థానాలకు 41 నామినేషన్ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేశారు. శనివారం అధికారులు స్క్రూట్ ని నిర్వహించారు. అందులో రెండు నామినేషన్లు కు సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. తూర్పు వీరాయపాలెం చెందిన వైసీపీ అభ్యర్థి నామినేషన్ రాజంపల్లికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం 39 మంది ఎన్నికల బరిలో నిలిచారు.