BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

తిరుపతిలో వైసిపికి బిగ్ షాక్ -వలసలతో టీడీపీకి మరింత బలోపేతం జేబీ సైన్యంలోకి వైసీపీకి చెందిన 150 మంది చేరిక

Select Suryaa Now
తిరుపతిలో వైసిపికి బిగ్ షాక్  -వలసలతో టీడీపీకి మరింత బలోపేతం  జేబీ సైన్యంలోకి వైసీపీకి చెందిన 150 మంది చేరిక

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి నగరంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ పై నమ్మకం కోల్పోయిన ఆ పార్టీకి చెందిన క్యాడర్ టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారు. వలసల బాటతో వైసిపికి కోలుకోవాలని దెబ్బ తగిలింది అనటానికి తాజా చేరికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ చరిష్మా ముందు వైసీపీ నిలవలేకపోతోంది. జేబీ శ్రీనివాస్ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తున్నారంటేనే వైసీపీ పతనం ఎంత వేగంగా జరుగుతోందో అర్థమవుతోంది. 38వ డివిజన్ వైసీపీకి వెన్నెముక లాంటి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్ తో పాటు పి.మునిరత్నం, ప్రసాద్ బృందం 50 మందితో టిడిపిలోకి చేరారు. ఎస్సీ వర్గాల్లో కూడా వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి ఇదే నిదర్శనం. అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు వి.ఎస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సూరి, నగర కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా మహిళా కార్యదర్శి అనిత, సుగుణ, రాణి, మంజుల లాంటి కీలక నేతలు సుమారు 100 మందితో టీడీపీలో చేరారు. మహిళా నేతలు కూడా వైసీపీని వీడారంటే ఆ పార్టీలో మహిళలకు ఎంత దారుణ పరిస్థితి ఉందో తెలుస్తోంది.

జేబీ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక 

వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, కబ్జాలు, దోపిడీలతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం, జేబీ శ్రీనివాస్ అభివృద్ధి వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఈ చేరికలే రుజువు చేస్తున్నాయి. వైసిపిని వీడి టిడిపిలో చేరిన వారికి జేబీ శ్రీనివాస్ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జేబీ శ్రీనివాస్ తిరుపతి అభివృద్ధి చేస్తారని నమ్మి, టీడీపీ పార్టీ పై నమ్మకంతో తెలుగుదేశం లోకి వచ్చామని తెలిపారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్