BREAKING
గౌరవప్రదంగా జీవించాలి ---జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ టిడిపి, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 మంది యువకులు నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు!

మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు  కలెక్టరేట్  మేజర్ న్యూస్  :   మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై విస్తృత అవగాహన కల్పించి, వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుందని, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  శనివారం నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయం వరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రొమ్ము క్యాన్సర్ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చికిత్సా ఫలితాలు మెరుగుపడటంతో పాటు, వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేందుకు సంకోచించకూడదని, రొమ్ములో గడ్డలు, అసాధారణ మార్పులు లేదా ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.  ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు వైద్యుల సూచనల మేరకు మమోగ్రఫీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని వివరించారు. క్యాన్సర్‌పై భయంతో పరీక్షలకు దూరంగా ఉండకుండా, అవగాహనతో ముందుకు వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.  ప్రస్తుతం వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని క్యాన్సర్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అపోహలను తొలగించి, ముందస్తు పరీక్షల ప్రాధాన్యతను ప్రతి మహిళకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.  మహిళల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా శ్రద్ధ చూపాలని, అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారిని వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కుటుంబ స్థాయి నుంచి సమాజ స్థాయి వరకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని పేర్కొన్నారు.  ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు. తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం అందించడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సంస్థ ఎంతోమందికి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలు కూడా రెడ్‌క్రాస్‌తో కలిసి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో వైద్యులు, రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.