నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ మాగుంట లేఅవుట్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో, ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు, 27వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డికి అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపునకు కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.