నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్
నరసరావుపేట : జిల్లా లో అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసుల సన్నద్ధతను పరీక్షిస్తూ నరసరావు పేటలో మాబ్ ఆపరేషన్ (మాక్ డ్రిల్ ) నిర్వహిం చారు. పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అడహల్లి ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి పర్యవేక్షణలో ఈ విన్యాసాలు చేపట్టారు. ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి 40 మంది, ఏఆర్ విభాగం నుంచి 20 మంది, ట్రాఫిక్ విభాగం నుంచి 10 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణ, ట్రాఫిక్ సీఐ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..