నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ
నగరం, మేజర్ న్యూస్: స్థానిక మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు మండల వ్యాప్తంగా 76 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు అందగా శనివారం నామినేషన్ పత్రాల పరిశీలనలో ఏడు ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరించామని ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ తెలిపారు.
అవసరమైన పత్రాలు సమర్పించని కారణంగా తెలుగుదేశం పార్టీ తరపున 3, వైఎస్ఆర్సిపి తరఫున 4 నామినేషన్లు తిరస్కరించగా మిగిలిన 69 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఆర్వో సత్యనారాయణ ప్రకటించారు.