సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ
నరసరావుపేట : పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణానికి చెందిన రావిపాటి బాలు వెంకట్ కిరణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే స్పందించి ప్రభుత్వ సాయం అందేలా చొరవ చూపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల ప్రత్యేక సహకారంతో బాలు వెంకట్ కిరణ్ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధి (సీఎంర్ఫ్) ద్వారా రూ. 1,56,000 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని మంజూరు చేయించారు. ఈ ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తన చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం దూరం కాకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎల్ఓసీల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బాలు వెంకట్ కిరణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో కుటుంబం వద్దకు తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ఉన్నతాధికారులు మరియు మంత్రులతో మాట్లాడి అత్యవసరంగా ఎల్ఓసీ మంజూరు చేయించినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ లతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కి బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు అధ్యక్షులు హర్షద్ అలీ, ఐటీడీపీ నాయకులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…