BREAKING
పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు గ్రామాల వారిగా మంత్రి అభివృద్ధి పై సమీక్ష శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి నటి అభినియ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్: కూతురి కష్టాన్ని చూసి చలించిపోయిన తండ్రి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా మిల్లర్లు సహకరించాలి అన్ని వృత్తులలో వైద్య వృత్తి గొప్పది - జిల్లా కలెక్టర్ కె.హరిత పోలియో నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆరోగ్య మిషిన్ ఉద్యోగులు పోస్ట్ కార్డు ద్వారా సీఎం గవర్నర్ కు నిరసన *పరమర్శ* ఆటోలో ప్రయాణిస్తూ కనిపించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్: వీడియో వైరల్ 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం భజన్ చెరువు వద్ద నీటి సౌకర్యాన్ని ప్రారంభించిన సర్పంచ్ ధర్మతేజ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...!

జనాభా గణన ఫేజ్-2 సమస్యలను పరిష్కరించాలి : పిఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల శాఖ

Select Suryaa Now
జనాభా గణన ఫేజ్-2 సమస్యలను పరిష్కరించాలి : పిఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల శాఖ

కృష్ణ సూర్య న్యూస్ :
రాబోయే జనాభా గణన–2027 ఫేజ్-2 ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ఎదుర్కొనే సమస్యలను  పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు పీఆర్టీయూటీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మండల తహసీల్దార్‌ను కలిసి ప్రత్యేక వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా  పీఆర్టీయూటీఎస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఫేజ్-1 (ఇండ్ల గణన) సమయంలో ఎదురైన రకరకాల సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే ఫేజ్-2 లో అటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.
ముఖ్యంగా హౌస్ లిస్టింగ్ బ్లాకుల వర్గీకరణ ప్రక్రియను పక్కాగా, సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఎన్యుమరేటర్లను సరైన నిష్పత్తిలో కేటాయించాలన్నారు. సర్కిళ్ల పరిధిలో ఉత్పన్నమయ్యే సాంకేతిక మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,జనాభా గణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ విషయం పై తహసీల్దార్ సానుకూలంగా స్పందించి
ఫేజ్-1 ఇండ్ల గణన ప్రక్రియ విజయవంతం కావడంలో పీఆర్టీయూటీఎస్  మండల శాఖ అందించిన సేవలను, సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఫేజ్-2 జనాభా గణనలోనూ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  పీఆర్టీయూటీఎస్  మండల అధ్యక్షులు దండు శేఖర్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, గౌరవ అధ్యక్షులు ఎన్. శివరాజ్, టెక్నికల్ అసిస్టెంట్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

 

నర్సిములు , సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం