BREAKING
ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డ్ వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు

విజయనగరం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు, శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో అక్టోబర్ 23/24 అర్ధరాత్రి 350మంది పోలీసులతో రాత్రి పహారా, పట్టణంలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, సున్నపు బట్టీలు, ఎం.ఆర్.కాలేజ్ జంక్షన్, కోట జంక్షన్, దాసన్నపేట, బాబామెట్ట, పూల్‌బాగ్, లంకాపట్నం, కొత్తపేట, అవనాపువీధి తదితర ప్రాంతాల్లో 350 మంది పోలీసులను మోహరించి, విస్తృతంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 10  గంటల తరువాత అనవసరంగా వీధుల్లో సంచరించే గాలికి తిరిగే వ్యక్తులను, ఆకతాయిలను పోలీసులు ప్రశ్నించి,  కారణం లేకుండా మళ్ళీ వీధుల్లో తిరగవద్దని హెచ్చరించి పంపారు. రాత్రి 10 గంటల తరువాత ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి  ఉల్లంఘనకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు లేదా బహుమతులు పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు, బాలలు, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమన్నారు. ఎన్నికలు, అమ్మవారి పండగ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 100/112కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ గస్తీలో విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, వన్‌టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.