BREAKING
సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి పీఎం రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం విఫలం నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన నాగండ్ల వైసీపీ నాయకులు నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్ వైట్‌హౌస్ ప్రెస్ బ్యూరో, డోనాల్డ్ ట్రంప్, అమెరికా మీడియా, వెస్ట్ వింగ్, జేమ్స్ బ్రాడీ ప్రెస్ రూమ్ మెదడు, వెన్నెముక ఆరోగ్యంపై కిమ్స్ అవగాహన కార్యక్రమం భారీ వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి 108 నామినేషన్లు ఆమోదం.... 7 తిరస్కరణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబు.

సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి

Select Suryaa Now
సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి

సర్వేపల్లి,  మేజర్ న్యూస్ :    సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని, వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులోని ఆయన నివాసంలో తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆమలూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. కోడి రవి, కోడి శ్రీనివాసులు, ఇంట్లూరు లోకేష్, మబ్బు అనిల్, ఇంట్లూరు అనిల్ తదితరులకు కాకాణి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీరుతోనే సర్వేపల్లిలో టీడీపీకి నష్టం జరుగుతోందని విమర్శించారు. అధికార పార్టీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి యువత, నాయకులు చేరడం శుభపరిణామమన్నారు. గతంలో పార్టీకి దూరమైన వారు తిరిగి జగన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీలో చేరికలు పెరగడం టీడీపీకి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాకాణి పిలుపునిచ్చారు.