BREAKING
పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి నటి అభినియ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్: కూతురి కష్టాన్ని చూసి చలించిపోయిన తండ్రి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు - కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు - కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ ప్రతినిధి: మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఇళ్లు లేని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.శనివారం దిమ్మదుర్తి గ్రామంలో కలెక్టర్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలో పలు ఇళ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.