అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు
పూసపాటిరేగ, సూర్య : గత ఏడాది కాలంలో గొలుసు దుకాణదారులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు తాసిల్దారు అన్ని రమణ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శనివారం పూసపాటిరేగ మండల తహసిల్దార్ ఎన్ వి రమణ సమక్షంలో మండలం కు చెందిన ఇది వరలో బెల్ట్ షాపులు నిర్వహించి కేసులు నమోదైన 17 మంది వ్యక్తులను అండర్ సెక్షన్ 129 బి ఎం ఎస్ ఎస్ చట్టం 2023 ప్రకారం ఒక సంవత్సర కాల పరిమితితో మరలా వారు బెల్ట్ షాపులు నిర్వహించి కేసులు నమోదైనచో లక్ష రూపాయల అపరాధ రుసుము చెల్లించుట లేదా జైలు శిక్ష అంగీకారం పై బైండోవర్ చేయడం జరుగుతోందని తాసిల్దార్ రమణ పేర్కొన్నారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.