భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం
వట్టిపల్లి;మండలంలోని మేడికుంద గ్రామంలో శనివారం నాడు (ఎల్ నినొ ప్రభావం ,నీటి నిలువల జాగ్రత్తల గురించి) ఎంపీడీవో సాయి తరుణ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ ఎం చంద్రకళ తెలిపినారు .ఈ సమావేశంలో ముఖ్యంగా ఇంకుడు గుంతల ఉపయోగాలు, ఏర్పాటు గురించి చర్చించినారు . ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూపాయలు 6500/- ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.ఎల్ నినొ ప్రభావంతో సరియైన వర్షం కురియక నీటి నిల్వలు తగ్గిపోయినాయి. నీటి కరువు, కరెంట్ ( పవర్) కష్టాలు వచ్చే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్తగా ఉన్న నీటిని వృధా చేయకుండా కాపాడాలని అన్నారు. ఇంటిలో వాడిన నీటిని ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్లయితే, భూమి పొరలలో నీటి నిలువలు పెరిగే అవకాశం ఉన్నది .ఫారం ఫౌండ్స్ ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ప్రజలను కోరినారు. ఇంకుడు గుంత ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, ఎంపీడీవో సాయి తరుణ్, సర్పంచ్ చంద్రకళ ,ఫీల్డ్ అసిస్టెంట్ సంగమేశ్వర్, టి ఏ మాధవరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.