BREAKING
వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డ్ వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు ఈటల రాజేందర్‌ను కలిసిన బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి అంగరంగ వైభవంగా గురుమా సనాతన సత్సంగ్ : నగరంలోని గోల్డెన్ టెంపుల్‌ కు ఆధ్యాత్మిక శోభ ప్రపంచ రికార్డు సాధించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థి : సాయిఫణి చరణ్‌ను ప్రశంసించిన చాన్సలర్ విజయ్ భాస్కర్ చౌదరి విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్

ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

Select Suryaa Now
ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

కొత్తవలస, సూర్య : మండలంలోని మంగళ పాలెం గ్రామంలో గల గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎ.ఆర్. దామోదర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగ ట్రస్ట్‌లో కృత్రిమ అవయవాల తయారీ, అమరికకు సంబంధించిన పనితీరును పరిశీలించి, అక్కడి సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సంవత్సరాలుగా దివ్యాంగులకు అండగా నిలుస్తూ అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం ద్వారా వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, ఇతర సహాయక పరికరాలు అందించడం వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. సేవాభావంతో పనిచేసే సంస్థలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, మరింతమంది దివ్యాంగులకు చేయూతనివ్వాలని ఆకాంక్షించారు. ఈ ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు రాపర్తి జగదీష్ కుమార్ ను ఆయన అభినందించారు ఆయన చేతుల మీదుగా 30 మంది దివ్యాంగులకు పైగా కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, హ్యాండ్ క్రచెస్,చెవిటి మిషన్,  మొదలగునవి  ఉచితంగా పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్  మరియు ట్రస్ట్ వైస్ చైర్మన్  మరియు ట్రస్ట్ బృందం పాల్గొన్నారు అలాగే కొత్తవలస మోడల్ స్కూల్, హై స్కూల్ మరియు బిఎస్ఎం స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.

రిపోర్టర్ : నాగరాజు, కొత్తవలస, విజయనగరం.