పరిశీలనలో అంతా సక్రమమే
పూసపాటిరేగ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పూసపాటిరేగ మండలానికి చెందిన 21 ఎంపీటీసీ స్థానాలు గాను వచ్చిన దరఖాస్తులన్నీ సక్ర మేమని ఎన్నికల అధికారి గోపి పేర్కొన్నారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన వారు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు నామ పత్రాలను దాఖలు చేశారు. వాటిని వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో శనివారం పరిశీలించారు. 21 ఎంపీటీసీ స్థానాలు గాను అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలను అభ్యర్థులతో పాటు అఖిలపక్ష రాజకీయ పార్టీలు సమక్షంలో పరిశీలన చేశారు. దరఖాస్తుల్లో అభ్యర్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో అన్ని సక్రమంగా ఉన్నట్లు ఆర్వో గోపి ఈ సందర్భంగా విలేకరులకు స్పష్టం చేశారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.