BREAKING
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు ​కె.వి.ఆర్. ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి ​సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్

నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే డీఏ ఏరియర్స్!

Select Suryaa Now
నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే డీఏ ఏరియర్స్!

రంగారెడ్డి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రూ.74.92 కోట్లకు పైగా నిధులు విడుదలైనా క్షేత్రస్థాయి సిబ్బందికి బకాయిలు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల సైదులు, తిర్-లెప్ట రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. గురుకుల సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి డీఏ బకాయిల చెల్లింపుల కోసం రూ.74,92,04,646 విలువైన 13 చెక్కులు జారీ చేసినట్లు తెలిపారు. 2021 జూలై నుంచి 2023 మే వరకు పెండింగ్‌లో ఉన్న డీఏ ఏరియర్స్‌తో పాటు ఇతర బకాయిల కోసం నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

అయితే ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాది క్రితమే డీఏ బకాయిలు చెల్లించి, గురుకులాల్లో విద్యాబోధన చేస్తున్న క్షేత్రస్థాయి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మాత్రం చెల్లించకపోవడం వివక్షాపూరితమని విమర్శించారు. ఈ సమస్యపై పలుమార్లు మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు.

సంస్థ కార్యదర్శి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు.

వి.శ్రీనివాసచారి: రంగారెడ్డి-మేజర్ న్యూస్