ముమ్మరంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ముమ్మరంగా నిర్వహించారు. స్థానిక మాజీ శాసనసభ్యులు, తెలంగాణ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి, ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టారు. గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట. సురేందర్ మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జె.అమర జ్యోతి,ఎస్ ఉమేష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, మోహన్, స్టేషన్ ఘన్పూర్ జనగామ జిల్లా