సూర్య కరీంనగర్ :కరీంనగర్ నగర పాలక సంస్థ 54 డివిజన్ అభివృద్ధిలో భాగంగా మసీదు వీధిలో (ఎస్.ఆర్.డి.జి. స్కూల్ నుండి ఓల్డ్ బైపాస్) రూ.50 లక్షల వ్యయంతో నూతన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ,నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహకారంతో, డివిజన్ అభివృద్ధి ఫండ్ నుండి రోడ్డు నిర్మాణం కోసం నిధులను కేటాయించి పనులను వేగవంతంగా పూర్తి చేశారు.గత కొన్ని రోజులుగా ఈ ప్రాంత ప్రజలు మసీదు వీధిలో రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ గొట్టేముక్కుల ఉమా రాణి వెంకటరమణ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ ప్రాంతంలోని స్థానిక ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాధాన్యతా క్రమంలో మొదటి విడతగానే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.దశాబ్దాల నాటి సమస్య తీరడంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ ప్రాంతంలోని ప్రముఖులు మసీదు కమిటీ సభ్యులు కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ ఉమా వెంకటరమణ లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ గొట్టేముక్కుల ఉమా రాణి వెంకటరమణ మాట్లాడుతూ డివిజన్ప్ర జలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు., ఎన్నికల వరకే రాజకీయాలకు పరిమితం కావాలని , డివిజన్ అభివృద్ధి కోసం అందరూ కలిసి వచ్చినప్పుడే సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని , డివిజన్ సమగ్రాభివృద్ధి జరుగుతుందని కార్పొరేటర్ గొట్టే ముక్కుల ఉమా రాణి వెంకటరమణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.