క్యాన్సర్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం..
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఒమేగా, పీఆర్‌కే హాస్పిటల్స్ సౌజన్యంతో బీహెచ్‌ఈఎల్ ఎంఐజీలోని ఇందిరాగాంధీ మహిళా భవనంలో జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ స్వర్ణకుమారి (రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒమేగా పీఆర్‌కే హాస్పిటల్స్) మాట్లాడుతూ.. ధూమపానం, మద్యపానం, పొగాకు వినియోగం, ఊబకాయం, పర్యావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్సతో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ మేరకు మహిళలకు ఉచితంగా మామోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కౌండిన్య వైద్య సేవలు అందించారు. జ్యోతి, శశిరేఖ , బి. లక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణి, శంభశివరావు, ఉమాశంకర్,ఆసుపత్రి సిబ్బంది జాకీర్ హుస్సేన్,సందీప్ ,విష్ణు తదితరులు పాల్గొన్నారు.