కొడిమ్యాల మండలంలో చైన్ స్నాచింగ్ కలకలం
సూర్య కొడిమ్యాల :జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోరీ ఘటన చోటుచేసుకుంది. గంగారం తండాకు చెందిన అజ్మీర దూరి (50) ఐకేపీ కేంద్రంలో ధాన్యం ఆరబెట్టేందుకు వెళ్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కొడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నరేష్ కుమార్ తెలిపారు.