కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్స్
కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్స్
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....కుకునూరుపల్లి మండల కేంద్రంలో వేద పాఠశాలలో శనివారం మొహమ్మద్ జహింగిర్ బ్లాక్ బెల్ట్ 8TH డాన్ వారి అధ్వర్యంలో విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్స్ పొందారు. ఇట్టి కార్యక్రమంలో యెల్లో బెల్ట్ కు 28 మంది విద్యార్థులు ఆరెంజ్ బెల్ట్ కు34 మంది విద్యార్థులు, గ్రీన్ బెల్టు కు11మంది విద్యార్థిని విద్యార్థులు అర్హత సాధించారు.ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పసల సంతోష్ మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
ఈకార్యక్రమంలో డైరెక్టర్ పసల శోభా రాణి కోచ్ నరేందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.