BREAKING
జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం

రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం

Select Suryaa Now
రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం

నెల్లూరు కలెక్టరేట్,  మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను అధికారులు సమన్వయంతో, అంకితభావంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.  శనివారం నెల్లూరులోని వీఆర్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సందర్శించి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు నిర్వహణ, సిబ్బంది విధులు, ఫలితాల నమోదు తదితర అంశాలను సమీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.  అనంతరం గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని, అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  కలెక్టర్ పర్యటనకు ముందుగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.