BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

కార్డియాక్, న్యూరోవాస్కులర్ చికిత్సలకు అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్

Select Suryaa Now
కార్డియాక్, న్యూరోవాస్కులర్ చికిత్సలకు అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : కార్డియాక్, న్యూరోవాస్కులర్ చికిత్సలను మరింత కచ్చితత్వంతో అందించేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా అధునాతన క్యానన్ ఆల్ఫెనిక్స్ బైప్లేన్ ఇమేజింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సాంకేతికతతో గుండె, మెదడు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో స్పష్టమైన ఇమేజింగ్‌తో పాటు మరింత కచ్చితత్వం సాధ్యమవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రారంభోత్సవానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ. శరత్ రెడ్డి పాల్గొన్నారు. సెంటర్ హెడ్ డాక్టర్ స్వరూప్, శరత్ చంద్రతో పాటు పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అత్యాధునిక వైద్య సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం లో మరో ముందడుగు వేసినట్లు మెడికవర్ యాజమాన్యం పేర్కొంది.