BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం -- వొడితల ప్రణవ్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం    -- వొడితల ప్రణవ్
సూర్య, వీణవంక:గత పదేళ్లలో నిలిచిపోయిన ఇళ్ల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం జీవం పోసిందని, ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల హామీని నెరవేరుస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. శుక్రవారం వీణవంక మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుని నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... గత 30 సంవత్సరాలుగా తాము సొంతింటి కోసం పడ్డ ఎదురుచూపులను కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంచార్జి వొడితల ప్రణవ్ నెరవేర్చారని, ఆర్థిక భరోసా కల్పించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో నేడు కొత్త ఇంటిలోకి అడుగుపెడుతుంటే సంతోషానికి అవధులు లేవని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై విమర్శలు చేసే కౌశిక్ రెడ్డి.. నేడు లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను కళ్లారా చూసి, వారి మొహాల్లోని ఆనందాన్ని గమనించాలని సూచించారు. పదేళ్ల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. మొదటి విడతతో పాటు రాబోయే రెండవ విడతలోనూ మరిన్ని ఇళ్లు మంజూరు చేసి అర్హులందరికీ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు జడల శ్రీకాంత్, గంగాడి తిరుపతి రెడ్డి, సాహెబ్ హుస్సేన్, చినాల ఐలయ్య యాదవ్, డైరెక్టర్ సునీల్ శ్రీపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వావినీల సత్యనారాయణ, జగన్ రెడ్డి, సతీష్ గౌడ్, ఎల్లారెడ్డి, చిలువేరు రమేష్, వీరయ్య, మోటం శ్రీనివాస్, పర్లపెళ్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.