BREAKING
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

ఇల్లందకుంట పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవము

Select Suryaa Now
ఇల్లందకుంట పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవము
సూర్య, ఇల్లందకుంట : ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి  మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా  మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విద్య యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు  నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ ( రిటైర్డ్ టీచర్ ), మండల విద్యాధికారి కే. రాములు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్  నజ్ నీమ్ చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి కె. రాములు నాయక్, ప్రధానోపాధ్యాయురాలు తస్మిన్ నజ్మీన్ లు మాట్లాడుతూ విద్య నిజమైన బలమని, జ్ఞానార్జన ద్వారా దేశ పురోగతికి, సమాజాభివృద్ధికి కృషి చేయవచ్చని తెలిపారు. తల వంచుకుని  పుస్తకము చదివితే, అదే పుస్తకము మిమ్మల్ని తల ఎత్తుకొని జీవించేలా చేస్తుందని, ఎవరైతే కష్టపడి చదువుతారో వారి జీవితము సుఖవంతము అవుతుందని, చదువుకున్నటువంటి వ్యక్తి దేశానికి ఒక శక్తివంతుడిగా తయారు చేస్తుందని, విద్యార్థులకు చదివే ముఖ్యమని ఈరోజు బాగా చదివిన విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటాడని, విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.  తదుపరి ఉపాధ్యాయ బృందం విద్య యొక్క  ప్రాముఖ్యత  వివరిస్తూ, మధురమ్మ ట్రస్ట్ వారు మండల స్థాయిలో మంచి కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ట్రస్టు నిర్వాహకులు జగదీశ్వర్ మాట్లాడుతూ మధురమమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 2011 సంవత్సరం నుండి ప్రభుత్వ సెక్టార్ల లోని విద్యార్థులకు, సమాజంలోని పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ నాయకుల జయంతి, వర్ధంతి  సందర్భంగా వ్యాసరచన పోటీలు, ఆటల పోటీలు, ప్రతిభ పోటీలు నిర్వహిస్తూ వారి ఆశయాలను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొనుటకు కార్యక్రమాలు తెలిపారు.  అనంతరం మండల స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన మొదటి ఇద్దరు విద్యార్థులు ఎం.రచన  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట,  పి. నాగలక్ష్మి కేజీబీవీ ఇల్లందకుంటలకు  శంకర్ నారాయణ డిక్షనరీ, మెమెంటోలను బహుమతి ప్రధానం చేయడం జరిగింది.  కన్సోలేషన్ ప్రైజులుగా బి. రక్షిత, ఎం. అక్షయ్, ఎం. సహస్ర, కె. రితిక్, డి. కావ్యశ్రీ,  బి. నితిన్, ఎం.అక్షయ్, డి. రితికలకు శంకర్ నారాయణ డిక్షనరీలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు  కే. జయప్రకాష్, సిహెచ్. వేణు,  కే. సత్యం, జె. రాధిక రాణి, మండలంలోని ఉపాధ్యాయులు ఎస్. అనసూయ, ప్రేమ్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.