ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం పేదల సంక్షేమమే... కాంగ్రెస్ లక్ష్యం..!
కోహీర్, :పేదల సంక్షేమం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, పేదల సొంతింటి కలను నేరవేరుస్తున్నామని, పేదల బ్రతుకుల్లో భూ పంపిణీ చేసిన చరిత్ర, ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సువర్ణ మల్లన్న పాటిల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని
పిచేరేగడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇల్లును ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేద కుటుంబాలకు ఆత్మగౌరవానికి, భద్రతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. తొరమామిడి యాదయ్య కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షద్, జె. అనంతరాం, రియాజుద్దీన్, ఫక్రుద్దీన్, పాండురంగారెడ్డి, చెరంగివి, కర్ణాకర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.