BREAKING
నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం. విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు - అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించిన కుమ్మరి ధన్‌రాజ్, నాయకపు గంగారం ఓ పసిప్రాణం కోసం.. రూ.26 కోట్ల నిరీక్షణ! పొన్నూరు మండల వెల్లలూరు గ్రామంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభం ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాలి కుందుర్పి లో తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రత్యేక సమావేశం. నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ! ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్.. వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగు సినిమా తీస్తా: జగ్గారెడ్డి

Select Suryaa Now
సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగు సినిమా తీస్తా: జగ్గారెడ్డి

సంగారెడ్డి : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ స్వయంగా రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా ఆమె జీవిత చరిత్రను తెలుగులో సినిమాగా తెరకెక్కిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాణానికి రూ.2 కోట్లు అందజేస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు ప్రకటించారు.

50 మందితో ప్రత్యేక కమిటీ

సినిమా నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు 50 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఈ కమిటీని గాంధీభవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు నిధులు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎన్నికలకు ఖర్చు పెట్టినట్లుగానే ఈ సినిమాకు కూడా ఖర్చు చేయాలని, అవసరమైన బడ్జెట్ సమీకరించి మంచి దర్శకుడిని ఎంపిక చేద్దామని అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను ఆహ్వానించి వారి చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. సోనియాగాంధీ జీవితాన్ని కార్యకర్తలు మరింతగా తెలుసుకునేందుకు ఆమె రచించిన పుస్తక ప్రతులను తెప్పించి పంపిణీ చేస్తామని చెప్పారు.

కుటుంబ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు

ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్‌గాంధీ భార్యగా, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీల తల్లిగా సోనియాగాంధీ జీవితంలోని వివిధ ఘట్టాలను సినిమాలో ఆవిష్కరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలతో ఆ కుటుంబం ఎదుర్కొన్న విషాదం, అనంతరం సోనియాగాంధీ ఎదుర్కొన్న సవాళ్లు, పిల్లల పెంపకం, ఆమె రాజకీయ ప్రయాణాన్ని ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. అనేక మతాలు, కులాలు, భాషలతో కూడిన భారతదేశంలో సోనియాగాంధీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని అన్నారు. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవస్థ కూడా అంతటి లోతైనదని, ఆ రాజకీయ వ్యవస్థను సోనియాగాంధీ అధ్యయనం చేశారని వ్యాఖ్యానించారు.

 ప్రధాని పదవిని వదులుకోవడం చరిత్ర

సోనియాగాంధీకి ప్రధాని పదవిపై ఎలాంటి వ్యామోహం లేదని జగ్గారెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన సందర్భంలోనూ ఆమె పదవిని ఆశించలేదని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సోనియాగాంధీని ప్రధానిగా ఉండాలని పార్టీ నాయకులు కోరినా, ఆమె ఆ అవకాశాన్ని వదులుకుని మన్మోహన్‌సింగ్‌కు ప్రధానమంత్రి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆ పదవిని స్వీకరించకపోవడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని అభిప్రాయపడ్డారు.సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీల ఆలోచనల నుంచి ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీ కుటుంబం నుంచి మరోసారి ప్రధానమంత్రి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలనేది సోనియాగాంధీ ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.