BREAKING
నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం. విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు - అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించిన కుమ్మరి ధన్‌రాజ్, నాయకపు గంగారం ఓ పసిప్రాణం కోసం.. రూ.26 కోట్ల నిరీక్షణ! పొన్నూరు మండల వెల్లలూరు గ్రామంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభం ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాలి కుందుర్పి లో తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రత్యేక సమావేశం. నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ! ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్.. వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి

హంస హోమియోపతి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
హంస హోమియోపతి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

శామీర్‌పేట,మేజర్ న్యూస్:ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, వాటి నివారణ మరియు చికిత్సపై అవగాహన కల్పించే ఉద్దేశంతో హంస హోమియోపతి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా
అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీషా కృష్ణారెడ్డి ,కమిషనర్ ఎన్.వెంకట్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిబిరంలో వైద్య నిపుణులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. హంస హోమియోపతి వైద్య కళాశాల యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.