BREAKING
నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం. విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు - అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించిన కుమ్మరి ధన్‌రాజ్, నాయకపు గంగారం ఓ పసిప్రాణం కోసం.. రూ.26 కోట్ల నిరీక్షణ! పొన్నూరు మండల వెల్లలూరు గ్రామంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభం ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాలి కుందుర్పి లో తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రత్యేక సమావేశం. నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ! ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్.. వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం, ప్రపంచ ఉర్దూ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం, ప్రపంచ ఉర్దూ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ; సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో జాతీయ విద్యా దినోత్సవం, ప్రపంచ ఉర్దూ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అరుణాబాయి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రభావతితో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అరుణాబాయి మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని విద్యారంగంలో రాణించాలని సూచించారు. విద్య వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ, దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉర్దూ భాషా సాహిత్యాల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. ఉర్దూ భాష గంగా జమునా తెహజీబ్, భాషా సామరస్యం, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు.

ఉర్దూ భాషలో ప్రసంగించిన అధ్యాపకులు

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఉర్దూ భాష తెలియని అధ్యాపకులు వరలక్ష్మి, సుప్రభ, గీత తదితరులు ఉర్దూలో ప్రసంగించడంతో పాటు చక్కని కవితలు, షేర్లు వినిపించారు. ఉర్దూ భాషపై వారికున్న అభిమానం, ఆసక్తి సభికులను ఆకట్టుకుంది. భాషలు మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతాయని, భాషా సామరస్యమే జాతీయ సమైక్యతకు బలమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

విద్యార్థినులకు బహుమతుల ప్రదానం

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇలాంటి పోటీలు విద్యార్థినుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వక్తృత్వ నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వరలక్ష్మి, సుప్రభ, గీత, డాక్టర్ ఆయేషా బేగం, కస్తూరి, రాజేష్, అస్రా, నవ్య, కలీముద్దీన్, ప్రవీణ్, హష్మత్, నవీన్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.